Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిన్న విడుదల... నేడు ఫేస్ బుక్ లో 'ఎంసిఎ' ఫుల్ మూవీ!

  • అన్నంతపనీ చేసిన పైరసీ మాఫియా
  • నాని కొత్త చిత్రం ఆన్ లైన్ లో
  • ఇప్పటికే చూసేసిన 8 వేల మంది
పైరసీ మాఫియా అన్నంతపనీ చేసింది. విడుదలైన సినిమాలను వెంటనే పైరసీ చేసే సత్తా ఉందని చెబుతూ నిర్మాతలను బెదిరిస్తున్న వారు, నిన్న విడుదలైన 'ఎంసిఎ' చిత్రాన్ని ఆన్ లైన్లో విడుదల చేసేశారు. ఈ సినిమాను పలువురు తమ ఫేస్ బుక్ పేజీలలో పోస్టు చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి తరువాత 'మున్నా డార్లింగ్' అనే ఫేస్ బుక్ ఐడీ నుంచి ఇది అప్ లోడ్ అయినట్టుగా కనిపిస్తుండగా, పలువురు దీన్ని షేర్ చేసుకుంటున్నారు.

ఇప్పటికే దాదాపు 8 వేల మందికి పైగా ఈ సినిమాను ఆన్ లైన్ లో వీక్షించడం గమనార్హం. పలువురు దీన్ని డౌన్ లోడ్ కూడా చేసుకుంటున్నారు. టాలీవుడ్ నుంచి పైరసీ భూతాన్ని తరిమికొట్టాలని నిర్మాత దిల్ రాజు తదితరులు రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయినా పైరసీ మాఫియా ఆగకపోవడం గమనార్హం.
MCA
Nani
Pairacy
Tollywood

More Telugu News